banner



How To Earn Money Youtube In Telugu

యూట్యూబ్ వీడియోలతో ఆదాయం పొందడం ఎలా?

| | Updated: Nov 30, 2018, 10:09 PM

యూట్యూబ్ ఛానెళ్లు మభ్యపెట్టి మరీ వీడియోలు చూసేలా ఎందుకు చేస్తాయి? అలా చేయడం వల్ల వారికి లాభం ఏమిటీ? తదితర అంశాలపై ఆసక్తికర విషయాలు మీ కోసం.

youtube

యూట్యూబ్‌లోకి వెళ్లగానే మిమ్మల్ని బోలెడన్ని తెలుగు ఛానెళ్లు.. రకరకాల టైటిళ్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాయి. వీటిలో కొన్ని.. లోపల ఏ విషయం లేకపోయినా.. పైన మాత్రం టైటిళ్లు, ఫొటోలతో ఆసక్తి రేకెత్తిస్తాయి. వీటిని చూసి మోసపోయేవారు.. ఎందుకురా బాబు? మా టైమ్ వేస్టు చేస్తారంటూ తిట్టిపోస్తాం. మీరు ఎంత తిట్టినా వాళ్లు మారరు. ఎందుకంటే.. వారికి మీ వ్యూస్ వస్తే చాలు, జేబులు నిండిపోతాయి. ఓ రకంగా చెప్పాలంటే.. మీ ఆసక్తే వారికి పెట్టుబడి, మీ తిట్లే వారికి ఆశీర్వాదం. అయితే, మీరూ ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టేద్దాం అనుకుంటున్నారా? అది అంత ఈజీ కాదండోయ్. కేవలం వ్యూసే కాదు.. 'స‌బ్‌స్క్రైబర్లు' కూడా భారీగానే ఉండాలి. అయితే, మీరు తెలివి తేటలను ఉపయోగించడం ద్వారా 'యూట్యూబ్' నుంచి బోలెడంత ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఇందుకు మీరు 'యూట్యూబ్' వ్యూవర్ల నమ్మకాన్ని సొంతం చేసుకోవాలి. అలాగే, మీరు చూపించే వీడియోలు సరికొత్తగా, ఆకట్టుకునేలా ఉండాలి. మీ లక్ బాగుంటే.. కోటీశ్వర్లు అయ్యే అవకాశం కూడా ఉంది.

ఏం చేయాలి? రాబడి ఎలా?: మీరు కేవలం వ్యాపారం కోసమే 'యూట్యూబ్' ఛానెల్‌ను ఓపెన్ చేస్తున్నట్లయితే.. ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోండి.
1. మీరు పెట్టే వీడియోల వాచ్‌టైమ్.. అంటే ప్రేక్షకులు వీడియో చూసే నిడివి కనీసం 4వేల గంటలు దాటాలి.
2. మీ ఛానెల్‌కు కనీసం 1000 పైగా స‌బ్‌స్క్రైబర్లు ఉండాలి.
3. మీ ఛానెల్1000 మంది స‌బ్‌స్క్రైబర్లను పొందగానే 'యూట్యూబ్' నిర్వాహకులకు రివ్యూ రిక్వెస్ట్ పంపాలి.
4. మీ రిక్వెస్ట్ స్వీకరణ తర్వాత మీ ఛానెల్ 'యూట్యూబ్' నిబంధనలు సక్రమంగా పాటిస్తుందా లేదా ఇతరుల వీడియోలను పోస్టు చేస్తున్నారా అనేది చూస్తుంది.
5. ఇందులో మీరు పెట్టే వీడియోలు గానీ, వీడియోలో ఉపయోగించే ఫొటోలు గానీ.. కాపీరైట్ యాక్ట్‌లో ఉండకూడదు. అంటే, ఆ వీడియోలు, ఫొటోలు మీ సొంతమై ఉండాలి.
6. ఇవన్నీ పరిశీలించిన తర్వాత 'యూట్యూబ్' మానిటైజేషన్‌ను ఎనాబుల్ చేస్తారు.
7. ఈ మేరకు మీరు 'యూట్యూబ్' పాలసీని తప్పకుండా పాటించాలి.
8. యూట్యూబ్ నుంచి అనుమతి లభించిన తర్వాత మీ వీడియోలకు 'యాడ్స్' వస్తాయి.
9. ఆ ప్రకటనల నగదు మీకు రావాలంటే 'గూగుల్ యాడ్‌సెన్స్ అకౌంట్'కు రిజిస్టర్ అవ్వండి.
10. ఇందుకు మీరు google.com/adsense క్లిక్ చేయండి.
11. అందులో మీ అకౌంట్ వివరాలు ఇవ్వాలి. యాడ్‌సెన్స్‌లో పేర్కొన్న వివరాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఒకేలా ఉండాలి.
12. మీ ఛానల్‌‌కు సుమారు 10 డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.697) లభించిన తర్వాత కూడా వెరిఫికేషన్ చేస్తారు.
13. మీరు 'యూట్యూబ్‌', 'గూగుల్ యాడ్‌సెన్స్'లో పెట్టిన చిరునామాకు వెరిఫికేషన్ కోడ్‌ను పంపుతారు.
14. ఆ వెరిఫికేషన్ కోడ్‌ను 'గూగుల్‌ యాడ్‌‌సెన్స్‌' అకౌంట్‌‌లో పెట్టాలి.
15. అనంతరం బ్యాంకు అకౌంట్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి 'యాడ్‌సెన్స్‌' అకౌంట్‌ని యాడ్ చేయాలి.
16. అప్పటి నుంచి మీ వీడియోలకు లభించే వ్యూలు, స‌బ్‌స్క్రైబర్ల సంఖ్య, వాచ్‌టైమ్ పెరిగే కొద్ది మీకు రావల్సిన మొత్తం అకౌంట్లోకి చేరుతుంది.
17. అయితే, యూట్యూబ్ ఇన్ని వ్యూస్‌కు ఇంత చెల్లిస్తామనే లెక్కలైతే చెప్పలేదు. ఎందుకంటే ఇందులో 'పార్టనర్ ప్రోగ్రామ్' మాత్రమే కాకుండా, స్వయంగా ప్రకటను సంపాదించే అవకాశం కూడా ఉంది.
18. పైన చెప్పిన ఆదాయమంతా 'పార్టనర్ ప్రోగ్రామ్'లో భాగంగానే వస్తుంది.
19. ఇది కాకుండా సొంతంగా ఆదాయం రావాలంటే.. మీ ఛానెల్ బాగా పాపులర్ కావాలి.
20. అత్యధిక స‌బ్‌స్క్రైబర్లను పొందినట్లయితే ప్రపంచస్థాయిలోని దిగ్గజ సంస్థలు మీ కోసం క్యూకడతాయి.

ఆదాయమే ఆదాయం: ఉదాహరణకు 'ఫన్‌టాయ్స్ కలెక్టర్ డిస్నీ టాయ్స్ రివ్యూ' అనే యూట్యూబ్ ఛానెల్ ఏడాదికి సుమారు రూ.40 కోట్ల ఆదాయాన్ని పొందుతోంది. ఇందులో ఓ యువతి 'డిస్నీ' సంస్థ విడుదల చేసే సరికొత్త బొమ్మలను ఓపెన్ చేస్తూ రివ్యూ చెబుతుంది. ఈ వీడియోలను నెలకు కనీసం పది కోట్ల మంది వీక్షిస్తున్నారు. ఫలితంగా ఆమె ఏటా భారీగా ఆదాయాన్ని పొందుతోంది. ఈ ఛానెల్‌కు సుమారు 11 మిలియన్ స‌బ్‌స్క్రైబర్లు ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరూ ఏదైనా కొత్త ఆలోచనతో 'యూట్యూబ్'లో ఛానెల్ పెట్టండి. వీక్షకుల అభిమానం పొంది.. నిత్యం వారికి వినోదాన్ని పంచుతూ.. ఆదాయం పొందండి.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : how to make money on youtube: ads, sponsors and off-site
Telugu News from Samayam Telugu, TIL Network

How To Earn Money Youtube In Telugu

Source: https://telugu.samayam.com/tech/news/how-to-make-money-on-youtube-ads-sponsors-and-off-site/articleshow/66885869.cms

Posted by: jacksonwitimen.blogspot.com

Related Posts

0 Response to "How To Earn Money Youtube In Telugu"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel